నంద్యాల: పట్టపగలే చోరీ. 12 తులాల గోల్డ్ మాయం

56చూసినవారు
నంద్యాల: పట్టపగలే చోరీ. 12 తులాల గోల్డ్ మాయం
నంద్యాల జిల్లా శ్రీరామనగర్ లో పట్టపగలే చోరీ జరిగింది. అది కూడా ఓ మాజీ సైనికుడి ఇంట్లో. ధర్మా రెడ్డి అనే మాజీ సైనికుడు శనివారం ఉదయం తన భార్య, పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం వేచిన చూసిన దుండగులు ఇంటి వెనుక భాగం నుంచి దూకి తాళం పగలగొట్టి. బీరువాలోని 12 తులాల బంగారం, రూ.30వేల వరకు నగదు దోచుకెళ్లారు. అనంతరం విషయం తెలుసుకున్న బాధితులు. పోలీసులకు తగు వివరాలతో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్