నంద్యాల: బిజెపి నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి

75చూసినవారు
నంద్యాల: బిజెపి నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సోమవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహానికి నంద్యాల పట్టణ బిజెపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు పురంధీశ్వరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అలాగే దేశంలో ప్రతి రాజకీయ పార్టీ పై అంబేద్కర్ ప్రభావముందని అన్నారు.

సంబంధిత పోస్ట్