నంద్యాల పట్టణంలో ప్రపంచ తూనికలు, కొలతలు వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని సూపర్ మార్కెట్లలో తూనికలు, కొలతలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వినియోగదారుల అధ్యక్షులు అమీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ జిలాని బాషా, ఇన్స్పెక్టర్ అనిత ప్రజలకు అవగాహన కల్పించారు. వస్తువులను కొనుగోలు చేసినప్పుడు తూకం సరిగా ఉన్నదో, లేదో చూసుకోవాలని తెలిపారు.