ఇటీవల నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్లో నంద్యాల పట్టణానికి చెందిన 11 మంది బాలలు పతకాలు సాధించారు. కర్నూలు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ మంగళవారం విజేతలకు జ్ఞాపకాలు అందించి అభినందించారు. విజేతలు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలలో పతకాలు సాధించి నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మహబూబ్ బాషా, ఫయాజుద్దీన్ పాల్గొన్నారు.