యోగ సాధన ద్వారా శరీరం, మనస్సు ఏకీకృతం చేసే ఒక సంపూర్ణ వ్యాయామని నంద్యాల జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, మెడికల్ అధికారి ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోదర పెద్ద ఎత్తున మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.