నంద్యాల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు వాహనాలకి టెక్నాలజీతో కూడిన జిపిఎస్ లను అమర్చినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గురువారం తెలిపారు. నంద్యాలలో 7 హైవే మొబైల్ వాహనాలకి, 22 బ్లూ కోల్డ్ వాహనాలకి జిపిఎస్ లను అమర్చడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. దీని ద్వారా పోలీస్ సిబ్బంది ఏ ఏరియాలో తిరుగుతున్నారు. మునుపటి రోజులలో ఏ ఏ ఏరియాలో తిరిగారో కచ్చితంగా తెలుసుకోవచ్చు అన్నారు.