నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష తులసి దళార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు నిఖిలేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 300 మంది మహిళలు పాల్గొని తులసి దళాలను అర్చించారు. కశెట్టి కృష్ణమూర్తి, లగిశెట్టి సురేష్ కుమార్, సిరిగిరి గోపాలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.