జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా 15 రోజులపాటు పటిష్టంగా నిర్వహించిందని మంత్రి ఫరూక్ అన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంత సమాజ స్థాపనకు ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.