నంద్యాల రాజ్ టాకీస్ వద్ద టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించిన మంత్రి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో నేరుగా ముఖాముఖీ అయ్యి సమస్యలు తెలుసుకుని స్పందించిన మంత్రి తీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.