గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుకు సంబంధించి షెడ్యూల్ కులాల హక్కులకు భంగం కలగకుండా సబ్ డివిజనల్ కమిటీ సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.