భూమి రికార్డులలో మ్యూటేషన్ల దిద్దుబాటు, రెవెన్యూ సదస్సుల్లో భూ పరిష్కార నిమిత్తం స్వీకరించిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిర్ణీత కాలపరిమితి లోగా పరిష్కార మార్గాలు చూపాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మండల తాసిల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తో కలిసి భూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.