ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల అయ్యలూరు సాయి వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ మరియు టీచర్స్ , విద్యార్థులు ఆధ్వర్యంలో 25, 000 రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి అందజేశారు. శనివారం నంద్యాల మండలం గోస్పాడు లో అందజేశారు.