రాష్ట్ర మంత్రి ఎన్. ఎమ్. డి. ఫరూక్ జన్మదినోత్సవం సందర్భంగా గురువారం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ సౌజన్యంతో దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావులు 20 మంది దివ్యాంగులకు నెలవారి మందులను అందజేశారు. 10మంది దివ్యాంగులకు ఉచిత ఓపి హెల్త్ కార్డ్ పంపిణీ చేశారు.