నంద్యాల పట్టణంలో మొహర్రం సందర్భంగా ఆదివారం పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్డి చావడి, బైర్మల్ వీధి, కల్పనా సెంటర్, గాంధీ చౌక్ వంటి ప్రాంతాల నుంచి పీర్లను ఊరేగింపుగా తీసుకువచ్చారు. పలు వీధుల్లో పీర్లను కొలువు ఉంచి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.