ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహణలో ఈనెల 25 వ తేదీ, శనివారం నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో ఉన్న గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో నంద్యాల ప్రాంత దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. శనివారం నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో అధ్యక్షలు డాక్టర్ రవి కృష్ణ వివరాలు తెలియజేశారు.