నంద్యాల డీఎస్ఏ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

60చూసినవారు
నంద్యాల డీఎస్ఏ ఆధ్వర్యంలో  వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో వివిధ కేంద్రాల్లో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మే 1 నుండి 31 వరకు అన్ని క్రీడా విభాగాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంగళవారం నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ అధికారి ఎం. ఎ. వి. రాజు తెలిపారు. ఆసక్తి గల క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ కోచ్ లు, క్రీడాకారులు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్