నంద్యాల మూడవ పట్టణ సిఐగా సూర్య మౌళి శుక్రవారం నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అతిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించానన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిబ్బంది, తదితరులు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.