ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పింఛన్ల పంపిణీపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పింఛన్ దారులందరికీ మంగళవారం సాయంత్రంలోగా వంద శాతం పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.