నంద్యాల జిల్లాకు విచ్చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వెదుర్ల రామచంద్రరావు, ఏవీఆర్ ప్రసాద్ లు రైల్వే స్టేషన్లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి రామానాయుడు తొలిసారిగా నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేశారని తెలిపారు. జిల్లాలో వారు ప్రాజెక్టులను సందర్శించడం, నీటి లభ్యత విషయంలో రైతులతో సమావేశం అవుతారని తెలిపారు.