మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి

78చూసినవారు
జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల పట్టణం గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్