నంద్యాల పట్టణంలో ఘనంగా వేమన జయంతి

73చూసినవారు
నంద్యాల పట్టణంలో ఘనంగా వేమన జయంతి
నంద్యాల పట్టణలోని పింగళిసూరన శాఖా గ్రంథాలయంలో ఆదివారం సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజల్లో నాటుకుపోయిన అంధ విశ్వాసాలపై వేమన సంధించిన పద్యాలన్నీ చురకత్తుల వంటివని, వేమన పద్యాలలోని హితోక్తులను మనిషి తన జీవితానికి అన్వయించుకుంటే మంచి వ్యక్తిత్వం పొందడం సాధ్యమవుతుందని వారు తెలిపారు. సాహితీ స్రవంతి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్