ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అపూర్వ మద్దతుతో అఖండ మెజారిటీ సాధించి ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేటితో తొలి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుంది. నంద్యాల నియోజకవర్గంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, విజయోత్సవ సంబారాలు గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది.