విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని నంద్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నిరసన దీక్షలు చేపట్టరు. విశాఖ ఉక్కు సాధించడం కోసం 64 మంది సీపీఐ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి ఆనాటి నుండి నేటి వరకు లక్ష మందికి పైగా ఉద్యోగ ఉపాధినిస్తున్న విశాఖ ఉక్కును కార్పొరేట్ సంస్థలకు ప్రధానంగా ఆదాని, అంబానీలకు అమ్మేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు.