భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా శుక్రవారం నిర్వహించారు. ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నంద్యాలలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.