నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదిదారుల నుంచి 86 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.