నంద్యాలలో వైసీపీ యువత పోరు యాత్ర

53చూసినవారు
నంద్యాలలో వైసీపీ యువత పోరు యాత్ర
ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "యువత పోరు" నిర్వహించారు. బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, పొచ బ్రహ్మానంద రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి తదితర వైయస్ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్