ఫొటోషూట్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

73చూసినవారు
ఫొటోషూట్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి
కర్నూలు మండలం పసుపులకు చెందిన కలపాగు ఇజ్రాయెల్ (17) మంగళవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇజ్రాయెల్ కర్నూలు బీటీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జగన్నాథగట్టుపైకి ఫొటోషూట్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వాహనం అదుపు చేసుకోలేక వేగంగా వెళ్లి చెట్టుకుఢీకొట్టడంతో ఇజ్రాయెల్ అక్కడికక్కడే మృతిచెందగా, స్నేహితులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్