గడివేముల మండలం ఎల్కే తండా, వైకేతండా గ్రామాల సమీపంలోని ఎరమ్రల కొండలలో నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ సీఐలు కృష్ణమూర్తి, కృష్ణ శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో నాటుసారా తయారీకి సిద్దంగా ఉన్న 1300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు. అక్రమంగా నాటుసారా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో ఎస్సై బ్రహ్మయ్య ఉన్నారు.