కల్లూరు: నాటుసారా స్థావరాలపై దాడులు

52చూసినవారు
కల్లూరు: నాటుసారా స్థావరాలపై దాడులు
కల్లూరు మండలం కొల్లంపల్లి తండాలో ఆదివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. నవోదయం కార్యక్రమం కింద కొల్లంపల్లి తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ విభాగం మెరుపుదాడులు నిర్వహించింది. 1300 లీటర్ల బెల్లం ఊట, 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. నాటుసారా తయారీదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాన్ని నాటుసారా రహితంగా తీర్చిదిద్దాలని సూచించారు.

సంబంధిత పోస్ట్