పాణ్యం మండలంలోని ఘాట్ రోడ్డులో సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సిమెంట్ నగర్ నుంచి పాణ్యం వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ మలుపు వద్ద అదుపు తప్పి కొండపై నుండి కిందకు జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయాలపాలయ్యాడు. ఘటన సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు.