పాణ్యం నియోజకవర్గానికి తొలిసారి ముఖ్యమంత్రి రావడం సంతోషంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. శనివారం కల్లూరు సభలో మాట్లాడారు. 2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని, పాణ్యాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, సీఎం సహాయంతో అభివృద్ధి, సంక్షేమం సాధిస్తానని అన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుండి నీరు ఇస్తామని, ఎక్స్టెన్షన్ ఏరియాల్లో సౌకర్యాలు మంజూరు చేయాలని కోరారు.