చిన్నటేకూరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

50చూసినవారు
చిన్నటేకూరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం సుల్తానాపురంకు చెందిన శ్రీనివాసులు, కర్నూలులోని ఒక ఆసుపత్రిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్ పొలం వద్ద ఉన్న ఫెన్సింగ్ గేటు వద్ద విద్యుత్ తీగను పక్కకు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్