గడివేముల మండలం పెసరవాయికు చెందిన మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. బుధవారం ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం చిన్న రఘుస్వామిరెడ్డి గడిగరేవుల గోడౌన్ కు జొన్న ధాన్యాన్ని తీసుకెళ్లినప్పుడు ట్రాక్టర్ అన్ లోడ్ చేసేందుకు ట్రాక్టర్ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఘర్షణ జరిగింది. మధుసూదన్రెడ్డి తో గొడవ పడ్డారు. రాయితో చిన్నరఘుస్వామి రెడ్డిపై దాడి చేసి, గాయాలపరిచినట్లు ఫిర్యాదు చేశారన్నారు.