పాణ్యం నియోజకవర్గానికి నీటి సరఫరా మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి కల్లూరులో ఎమ్మెల్యే చరితరెడ్డిని కలిసి, మాట్లాడారు. సమావేశంలో సాగునీటి సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా కేసీ కెనాల్ ప్రాజెక్టు దశలు, సాగునీటి అందుబాటులో తీసుకునే చర్యలు, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.