పాణ్యం: గ్రావెల్ లేక ఇబ్బంది.. వాహనాలు ఎదురైతే ప్రమాదమే!

69చూసినవారు
పాణ్యం: గ్రావెల్ లేక ఇబ్బంది.. వాహనాలు ఎదురైతే ప్రమాదమే!
పాణ్యంలోని అయ్యపురెడ్డి కాలనీలో చర్చి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్మించిన సీసీరోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేసేందుకు అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని బుధవారం స్థానికులు తెలిపారు. సైడులు లోతుగా ఉండటంతో రెండు వాహనాలు ఎదురైతే వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. ఆసుపత్రికి వచ్చే ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైనే బైకులు నిలుపుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్