పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఉన్న ఓబులమ్మ చెరువు (సర్వే నం. 1638)పై ఆక్రమణకు గురైందని అల్ ఇండియా యూత్ లీగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పాణ్యంలో ఆయన మాట్లాడుతూ 8. 09 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసి బోరు వేసి వరి పంటలు పండిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి చెరువుల పరిరక్షణకు బౌండరీలు వేయాలని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.