ఎన్ఎస్ఎం ఈ-సర్వే, మిస్సింగ్ సిటిజన్, పీఏసీఎస్ ఈ-కేవైసీ సర్వేలపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేసి రెండు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో జి. నాసర రెడ్డి ఆదేశించారు. గురువారం ఓర్వకల్లు ఎంపీడీవో ఆఫీసును సందర్శించారు. గత రెండేళ్లుగా మండల పరిషత్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఆడిట్లో పెండింగ్ అభ్యంతరాలపై నివేదికలు తయారు చేయాలన్నారు.