మహిళల విద్య కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయురాలు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలేను అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఓర్వకల్లు కేజీబీవీ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేశ్వరి అన్నారు. శుక్రవారం కేజీబీవీ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. బడుగుల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.