ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 20వ వార్డు కేంద్రీయ విద్యాలయం సమీపంలో జరిగే సభలో పాల్గొననున్నారు. గురువారం సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి, టీడీపీ నేత వెంకట రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. మల్లెల రాజశేఖర్, ప్రభుత్వ అధికారులు, నేతలు పాల్గొన్నారు.