ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం పునఃప్రారంభించారు. పాణ్యం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. పాణ్యం జడ్పీటీసీ రంగరమేష్, లాయర్ బాబు, ఎంఈవోలు కోటయ్య, సుబ్రమణ్యం, కళాశాల ప్రిన్సిపాల్, స్టాఫ్ పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులకు ఈ పథకం తోడ్పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.