ఓర్వకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శనివారం "డొక్కా సీతమ్మ" మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, కళాశాల అధికారులు పాల్గొన్నారు.