నిరుద్యోగ యువతకు గొర్రెల పెంపకంపై ఉచిత శిక్షణ

73చూసినవారు
నిరుద్యోగ యువతకు గొర్రెల పెంపకంపై ఉచిత శిక్షణ
కర్నూలు, నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ గొర్రెల పెంపకంపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ కె. పుష్పకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 7వ తేదీ నుంచి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు ఉండి చదవడం, రాయడం వచ్చి ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలకు 90007 10508 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్