పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యకమంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి, కరపత్రాలు అందజేశారు. కూటమి ఏడాది ప్రగతిలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. పాణ్యం నియోజకవర్గం పరిశీలకులు ఆదేన్న, జయరామిరెడ్డి పాల్గొన్నారు.