హుసేనాపురం: రైతుల కృషితోనే దేశాభివృద్ధి: మల్లెల రాజశేఖర్

53చూసినవారు
ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో బుధవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం రైతులతో కలిసి పొలాల్లో పంట వేయడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల కృషితోనే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్