కల్లూరు అర్బన్ 19వ వార్డు సోమిశెట్టి నగర్‌లో 144 రేషన్ షాపుకు చెందిన బియ్యాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా ఆదివారం టీడీపీ నాయకులు పట్టుకొని సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నాగిరెడ్డి, చాంద్ బాషా పాల్గొన్నారు. అక్రమ రేషన్ రవాణాపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.