పాణ్యం మండలం బలపనూరు గ్రామం వద్ద కంకర లోడ్ తో వెళ్తున్న ఒక టిప్పర్ అదుపు తప్పింది. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే పనుల కోసం కంకర తీసుకెళ్తున్న టిప్పర్ ఓ కల్వ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఇరుక్కుపోయింది. ప్రమాదం జరుగుతుందోని భావించిన డ్రైవర్ చాకచక్యంగా స్పందించి ప్రమాదాన్ని తప్పించాడు. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీ సహాయంతో టిప్పర్ ను తీయించారు.