కల్లూరు: కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్

95చూసినవారు
కల్లూరు అర్బన్ పరిధిలోని ముజఫర్ నగర్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఆదివారం సిఐటియు నగర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు గౌండలు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటి వృత్తుల్లో పనిచేస్తున్నా, ప్రభుత్వం వారి సంక్షేమ బోర్డును నిలిపివేయడం వల్ల ఆర్థిక సహాయం లభించడం లేదని ఆరోపించారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 13న నగర మహాసభ నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్