డ్వాక్రా, మెప్మా మహిళలను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కల్లూరు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ డ్వాక్రా, మెప్మా సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్లూరు డ్వాక్రా మహిళలు పాలకొవ్వ తయారీతో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. మహిళలకు చేయూతనిచ్చి రెండింటిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ఈ సంవత్సరం లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని అన్నారు.