చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ప్రజలకు చీకటి రోజులు మిగిల్చిందని, హామీల పేరుతో 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. శనివారం పాణ్యంలో జరిగిన కార్యక్రమంలో కూటమి పాలన వైఫల్యాలను తెలియజేస్తూ, చీకటి పాలన పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే ఈ పుస్తకం అని తెలిపారు.