జులై 9న దేశవ్యాప్తంగా సమ్మెకు సీఐటీయూ కల్లూరు నగర అధ్యక్షులు నరసింహులు పిలుపునిచ్చారు. శనివారం కల్లూరు అర్బన్ పరిధిలోని హమాలీ యూనియన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, పనిభద్రత, భీమా వంటి సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.